వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని

గుడిహత్నుర్ :  ఆగస్టు29 జనం సాక్షి)గణేష్ నవరాత్రి శాంతియుతంగా ఉత్సవాలను ప్రజలు  జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశాన్ని మత పెద్దలు మరియు గణేష్ మండపాల నిర్వాహకులతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసుకునేవారు ఖచ్చితంగా ఆన్లైన్ చేసుకోవాలని సూచించారు.గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం,రాత్రి వేళల్లో సభ్యుడు మండపం వద్ద ఉండాలని అన్నారు.విద్యుత్ సరఫరాకై ఖచ్చితంగా అనుమతి పొందాలని సూచించారు.మతవిద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ ఉత్సవాలను సోదరభావంతో జరుపుకోవాలని ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఉత్సవాలను సంయమనం పాటిస్తూ నిర్వహించుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఉండాలని నిర్వాహకులు పోలీసులకు సహకరించి ఉత్సవాలను శాంతియుతంగా పూర్తి చేయాలని సూచించారు.ఈ సమావేశంలో ఇచ్చోడ ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.నైలు,ఎస్సై ప్రవీణ్,ఏఎస్ఐలు రెహమాన్ ఖాన్,రమేష్, ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,మత పెద్దలు,గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.