కూకట్ పల్లి( జనంసాక్షి ):వినాయక చవితి సంధర్భంగా కూకట్ పల్లి భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద వినాయక భక్త బృందం ఆహ్వానం మేరకు గణేష్ మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో బుధవారం జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుడి కృపతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హనుమంతరావు,
మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి,నారాయణ పెట్ జిల్లా ఇంచార్జ్ మాధవరం కాంతారావు,కార్పొరేటర్ కె.మహేందర్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యారావు, సూర్యప్రకాష్,సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, యువ మోర్చా నాయకులు,వినాయక భక్త బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వినాయక భక్త బృందం మండపంలోని గణేషుడి ప్రత్యేక పూజలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్




