Tuesday, 3 November 2026

వినాయక మండపాలకు పర్మిషన్లు తప్పనిసరి

 

శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరువుకోవాలి

సిఐ జార్జ్ ఎస్సై బాల్ రాజ్

జనంసాక్షి/ పెద్ద శంకరంపేట ఆగస్టు 26
గణేష్ నవరాత్రి ఉత్సవాలను పండుగ వాతావరణంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎస్సై బాలరాజు అన్నారు. పెద్ద శంకరంపేట మండల కేంద్రములో గురువారం నాడు స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతు గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఒక పండుగ వాతావరణంలో సంతోషంగా జరువుకోవాలన్నారు. అదేవిధంగా డీజే లకు ఎలాంటి అనుమతులు లేవని మండపాల ఏర్పాటుకు ఉత్తమమైన వస్తువులను వాడాలి, ప్రజల తాకిడి నుంచి గాని, గాలి విచినప్పుడు, వర్షం కురిసినప్పుడు ఇబ్బంది కలగకుండా కూలిపోకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా జంతువులు మండపాల్లోకి ప్రవేశించకుండా చూడాలి, విద్యుత్ కలెక్షన్లు లైట్ ల ఏర్పాటుకు ఉత్తమమైన లైట్లు, వైర్లు వాడాలి, ముఖ్యంగా మండపాల పేరుతో ఎలాంటి లక్కీ డ్రాలు జూదం నిర్వహించరాదని అలాగే డబ్బులు వసూల్లకు పాల్పడరాదని మండపాల వద్ద మద్యపానం చేయకూడదని, అసాంఘిక కార్యకలాపాలు చట్ట వ్యతిరేక
కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. ఊరేగింపు వాహనం ఇతర మతాల ప్రార్థన మందిరాల వద్ద నిలపరాదు. ట్రాఫిక్కు అంతరాయం కలిగించరాదు, ముఖ్యంగా ప్రజలను రెచ్చగొట్టేలా ఉపన్యాసాలు మరియు నినాదాలు చేయరాదని సూచించారు. గణేష్ మండపాల వద్ద విద్యుత్ అవసరమైందని సంబంధిత అధికారులు అనుమతి తీసుకొని జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గ్రామ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మురళి పంతులు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు సిఐ జార్జ్. ఎస్సై బాలరాజ్ స్వర్ణకార సంఘం అధ్యక్షులు అవుసుల నరసింహ చారి కుల సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు