వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తా

– డి ఈ వెంకట కృష్ణయ్య హుజూర్ నగర్, సెప్టెంబర్ 9 (జనం సాక్షి):విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హుజూర్ నగర్ ట్రాన్స్ కో నూతన డి ఈ గా బాధ్యతలు చేపట్టిన వెంకట కృష్ణయ్య అన్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ లో విధులు నిర్వర్తిస్తు బదిలీపై హుజూర్ నగర్ డి ఈ గా బాధ్యతలు చేపట్టిన వెంకట కృష్ణయ్య డీఈ కార్యాలయంలో మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికారులు ఎవరు అయినను అవినీతికి పాల్పడిన సహించబోమని హెచ్చరించారు. హుజూర్ నగర్ డిఈగా విధులు నిర్వహిస్తున్న అమరబోయిన శ్రీనివాసరావు సూర్యాపేట డిఈగా బదిలీ అయ్యారు.