Tuesday, 3 November 2026

విపక్షాలు రాద్ధాంతం చేయొద్దు : ఈటెల

 Eetala Rajender fire on opposition parties
హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేయొద్దని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు. ఇవాళ శాసనసభలో మంత్రి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీని స్వాగతించాలని కోరారు. దళితులకు ఇప్పటి వరకు 261 ఎకరాల ప్రభుత్వ భూమి, 1162 ఎకరాల ప్రైవేటు భూమిని పంపిణీ చేశామని స్పష్టం చేశారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మాఫీ చేసిన పంట రుణాలను పాత బకాయిల కిందకు తీసుకుంటే తమ దృష్టికి తీసుకురండి అని సూచించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రకటించారు. రైతు రుణమాఫీ కింద లక్షల మంది రైతులు లబ్ధి పొందారని పేర్కొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *