తెలంగాణలో గ్రావిూణ ఆర్థిక విప్లవం నడుస్తోంది
కెసిఆర్ మాత్రమే పనులు చేసి చూపారు: చారి
హైదరాబాద్,జూలై5(జనం సాక్షి): గత నాలుగేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం గ్రావిూణ ప్రాంతాల అభివృద్దికి ఖర్చు చేసిన నిధుల లెక్కతీస్తే తెలంగాణ ఎంతగా ముందుకు పోతున్నదీ అర్తం చేసుకోవచ్చని మాజీ ఎంపి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్. వేణుగోపాలాచారి అన్నారు. విద్యుత్, సాగు, తాగు నీరు సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకొని కెసిఆర్ అ¬రాత్రులు శ్రమిస్తున్నారని అన్నారురు. అందుకే ఈ రంగాల్లో తెలంగాణ గణనీయమైన ప్రగతి సాధించిందని అన్నారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి దిశగా ఒక గొప్ప ముందడుగు వేసే దిశగా కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారనిచెప్పారు. గొప్ప సంకల్పం లేకపోతే గోదావరి నదిపై ప్రాజెక్టును శరవేగంగా నడిపిస్తారని ఆయన ప్రశ్నించారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను ఆగమేఘాలవిూద పూర్తిచేసి పాలమూరుకు పచ్చలతోరణం కట్టబోతున్నారు. పింఛన్ల రూపేణా, రైతుబంధు, రైతు బీమా, విద్యుత్ సబ్సిడీల రూపేణా, సంక్షేమ పథకాల ద్వారా లక్ష కోట్లకు పైగా నిధులు పల్లెల్లో ఖర్చు చేశారు. వేలాది గ్రామాల్లో గత అరువై ఏండ్లలో జరుగని ప్రగతి ఈ నాలుగేండ్లలో జరిగింది. సమాజంలో ఒక భరోసాను, నమ్మకాన్ని కలిగించారు. ప్రభుత్వరంగంలో విద్యారంగాన్ని బలోపతేం చేస్తున్నారు.ప్రభుత్వదవాఖానలు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. మన రాష్ట్రం సృష్టించిన సంపద మన ప్రజలకు దక్కుతున్నది. తెలంగాణ వస్తే ఏమవుతుందని ప్రశ్నించినవాళ్లకు పల్లెలు, పట్టణాలు సమాధానం చెబుతున్నాయి. కేసీఆర్ ఒక్కరే చేసిన పనులు, సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలుచూపించగలుగుతున్నారు. 24గంటల నిరంతర విద్యుత్ అన్నది కలలో కూడా ఊహించని సామసమని, దానిని సాకారం చేసిన ఘనత కెసిఆర్దన్నారు. విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా వారిని ప్రజలు ఇక నమ్మరని అన్నారు. వారి దశ ముగిసిందన్నారు. ఇప్పుడు కెసిఆర్ దశ నడుస్తోందని అన్నారు.




