విప్లవ వీరుడు  సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్.

నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.కళ్ళు గీస్తే ఏమొస్తది కొడితే గోల్కొండ కిల్లానే కొట్టాలనే లక్ష్యంతో కేవలం 3,000 మంది సైన్యంతో మొగల్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకొని గోల్కొండ కిల్లానీ ఏడు నెలల పాటు ఏలిన,విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ అని సూర్యాపేట జిల్లా జై గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొప్పు రామకృష్ణ గౌడ్ కొనియాడారు.నేరేడుచర్ల పట్టణం లో సోమవారం జై గౌడ్ ఉద్యమ సంఘం సమావేశం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 372 జయంతి వారోత్సవాల పోస్టర్లను  ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైగౌడ్ జాతీయ అధ్యక్షుడు వట్టికూటి రామారావు గౌడ్ ఆధ్వర్యంలోఈనెల ఏడో తారీఖు ఆదివారం భాగ్యనగరం లోగల,రవీంద్ర భారతిలో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల గౌడ ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నారని  గౌడ బంధువులందరూ తప్పకుండా హాజరు అయి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వడ్డగాని లింగయ్య గౌడ్,కొండ రాము గౌడ్,కాసాని లింగయ్య గౌడ్, పోలగాని భరత్ గౌడ్, కంభంపాటి కుమార్ గౌడ్, సోమనరసయ్య గౌడ్, పులి కోటయ్య గౌడ్, నేలపట్ల లక్ష్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు