విప్ రేగ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ తీర్థం.

అభివృద్ధికి ఆకర్షితులై బి ఆర్ ఎస్ పార్టీలో చేరిక…

బూర్గంపహాడ్ అక్టోబర్ 15 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య చిన్న లక్ష్మణ్ విప్ రేగా సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య చిన్న లక్ష్మణ్ బి ఆర్ ఎస్ పార్టీ లో చేరారు. వారికి గులాబీ కండవా కప్పి పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆహ్వానించి, చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. బి ఆర్ ఎస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నదనే భరోసాతో ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని విశ్వసిస్తూ స్వచ్ఛందంగానే బి ఆర్ ఎస్ పార్టీలోకి వస్తున్నారని ఆయన అన్నారు.