Thursday, 5 November 2026

విభజన చట్టంలో లొసుగులేంటో ముందు చెప్పాలి: రఘువీరా

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి  ): రాష్ట్ర విభజన చట్టంలో  భాగంగా ఆంధప్రదేశ్‌కు  ఇచ్చిన హావిూల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కోటి సంతకాల సేకరణ కొనసాగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రజల మద్దతుతో పాటు ఢిల్లీలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలో సవరించాల్సిన లొసుగులేంటో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడే చెప్పాలని రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో ఉన్న లొసుగుల గురించి చెప్పకుండా సవరణలు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. వీటిపై ఉన్న అనుమానాలు,అభ్యంతరాలు ముందుగా తెలపాలన్నారు. ఇక తిరుపతి ఉప ఎన్నిక జరిగిన తీరు అత్యంత దారుణమని అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కయ్యారని రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదిగా ఆ ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని ఆయన అన్నారు. తిరుపతి ప్రజలు కూడా ఇతర ప్రాంత టీడీపీ కార్యకర్తలతో లక్ష ఓట్లు రిగ్గింగ్‌ చేయించారన్నారు. తిరుపతిలో ఏకంగా లక్ష ఓట్ల రిగ్గింగ్‌ జరిగిందని ఎపిసిసి అద్యక్షుడు

రఘువీరారెడ్డి  ఆరోపిస్తున్నారు. తిరుపతి ఎన్నికలో అదికారులు ,టిడిపి నేతలు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్యవాదిగా ఎన్నిక జరిగిన తీరుకు సిగ్గుపడుతున్నామని రఘువీరా వ్యాఖ్యానించారు. ఇతర ప్రాంతాల నుంచి టిడిపి కార్యకర్తలను రప్పించి ఓట్లు వేయించారని ఆయన అన్నారు.విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హావిూలను వచ్చే పార్లమెంట్‌ బడ్జెట్లో, రాష్ట్రపతి ప్రసంగంలో పొందుపరచాలని రఘువీరా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశామన్నారు.  కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కోటి సంతకాల సేకరణ చేపట్టామని ఆయన చెప్పారు. విభజన చట్టంలో లోపాలు ఏమిటో వెంకయ్య నాయుడు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *