Thursday, 5 November 2026

విభజన సమస్యలపై చిత్తశుద్దిలేని బిజెపి నేతలు

 

ఒక్కటైనా జాతీయ ప్రాజెక్ట్‌ ప్రకటించారా

తెలంగాణకు చేసిన మేలేవిూ లేదు: చారి

హైదరాబాద్‌,మే25(జ‌నంసాక్షి): నాలుగేళ్లుగా విభజన సమస్యలను పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్న కేంద్రం వాటి పరిష్కారంలో చొరవ చూపాలని టిఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. పోరాటాల గడ్డపై ఏది పడితే అది మాట్లాడితే కుదురదని బీజేపీ నేతలను హెచ్చరించారు. సమస్యల విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారో చెప్పాలని డాక్టర్‌ వేణుగోపాలచారి అన్నారు. అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని బీజేపీని డిమాండ్‌ చేశారు. సీఎం కెసిఆర్‌ అడిగిన ఏ ఒక్క అంశానికైనా సమాధానాలు చెప్పగలరా అని బీజేపీ నేతలను ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇతర రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేస్తున్నాయని స్పష్టం చేశారు. అందరూ ఆశ్చర్యపడేలా పల్లె, పట్టణాలు, నగరాలకు 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. పోరాటాల గడ్డపై ఏదిపడితే అది మాట్లాడితే కుదరదన్నారు. ప్రధానంగా విభజన సమస్యలు పరిష్కరించాలని, ఏడు మండలాల విలీనంపై సమాధానం చెప్పాలని, ఎపి భవన్‌ విభజనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై బిజెపి నేతలు నోరు మెదపాలన్నారు. త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణను తక్కువ చేసి చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుల మాటలతో ఎవరు ఏం చేస్తున్నారో ప్రజలకు అర్థమైందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులపై సీఎం కేసీఆర్‌ చాలా స్పష్టంగా లెక్కలు చెప్పారని, ఒక్క ప్రశ్నకు కూడా బీజేపీ నేతలు సమాధానం చెప్పలేదని అన్నారు. దేశంలోనే మోస్ట్‌ హ్యాపెనింగ్‌ స్టేట్‌గా తెలంగాణ నిలుస్తోందని చెప్పారు. గ్రావిూణ ప్రాంతాల్లో కూడా 24 గంటల కరెంట్‌ ఇస్తున్నామని,రైతులకు24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని వివరించారు. శాంతి భద్రతలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం కృషిచేస్తున్నామని వివరించారు. గొల్లకురుమలు, మత్స్యకారుల జీవన వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.