Wednesday, 4 November 2026

– విరాళాలు సేకరిస్తున్న సుజాతనగర్ సీపీఐ మండల సమితి

సుజాతనగర్, జూలై19(జనంసాక్షి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రికార్డు స్థాయిలో గోదావరి వరదలు సంభవించి అనేక గ్రామాలు ముంపుకు గురైన నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించాలని సిపిఐ జిల్లా పార్టీ పిలుపు నిచ్చింది. దీనిలో భాగంగా మంగళవారం సుజాతనగర్ మండల కేంద్రంలో సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నిరాశ్రయులైన ముంపు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం విరాళాలు సేకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల సంయుక్త కార్యదర్శి కోమారి హనుమంతరావు, మండల సహాయ కార్యదర్శులు వేల్పుల భాస్కర్ పొదిల శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి ముక్కెర మురళి ,విద్యా కమిటీ చైర్మన్ కోమారి కృష్ణ ,బీమా, లక్ష్మయ్య ,భూక్య శీను ,మంగ్య, హథిరాం ,శంకర్ ,కొమరయ్య, నరసింహ ,కృష్ణ ,పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు*