విలీన గ్రామాల్లో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయవద్దు …మున్సిపల్ కమిషనర్ లెటర్
సిరిసిల్ల పట్టణంలో కొత్తగా కలిసిన ఏడు విలీన గ్రామాలకు సంబంధించిన స్థలాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సబ్ రిజిస్టర్ కు లెటర్ పంపినట్లు సబ్ రిజిస్టర్ తెలిపారు విలీన గ్రామాల్లో ఎక్కువ శాతం వ్యవసాయ భూములే ఉంటాయి. ప్రజలు తమ బిడ్డల పెళ్లిలకు లేదా చదువులకు గుంట రెండు గుంటల కు నాలా కన్వర్షన్ చేపించి రిజిస్ట్రేషన్‌కు వెళ్తుంటారు అయితే ఇవి అక్రమ లేఅవుట్ అని వాటిని రిజిస్టర్ చేయవద్దని కమిషనర్ లెటర్ పంపినట్లుగా సమాచారం దీనిపై విలీన గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి చేయడం లేదు అలాగే ఇంటి నెంబర్ల విషయంలో ఒకరి ఇంటి నెంబర్ మరొకరికి కేటాయిస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ ఇప్పుడు స్థలాలు రిజిస్టర్ చేయావద్దు అని లెటర్ పంపడంపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు
విలీన గ్రామాల్లో స్థలాలు రిజిస్ట్రేషన్ చేయవద్దు …మున్సిపల్ కమిషనర్ లెటర్




