జనం సాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలోని సూరయ్యపల్లికి చెందిన మంథని నియోజకవర్గ నవ తెలంగాణ దినపత్రిక విలేకరి ఆర్ల బాపు కొన్ని రోజుల క్రితం నుండి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు అని తెలిసి గురువారం బిఆర్ఎస్ నాయకులు, కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి వారి నివాసానికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
విలేఖరికి ఆర్థిక సాయం చేసిన చల్లా నారాయణరెడ్డి




