Thursday, 5 November 2026

విలేఖరి సహదేవ్ ను సీరోల్ ఎస్సై అవమానపరచడం సరికాదు.

కరణం రాజన్న సిపిఐ మండల కార్యదర్శి

కురవి సెప్టెంబర్-4
(జనంసాక్షి న్యూస్)

ఒక గిరిజన మహిళకు సంబంధించిన వాస్తవాలు ప్రచురించినందుకు సీరోల్ ఎస్సై నరేష్ అక్షర లీడర్ ప్రతినిధి బేత మల్లు సహదేవుని అవమానించడం సరికాదని సిపిఐ మండల కార్యదర్శి కార్యదర్శి కర్ణం రాజన్న అన్నారు.కురవి మండలంలోని నల్లెల్ల గ్రామ శివారు సూర్య తండకు చెందిన వృద్ధురాలు మిరప తోట మొక్కలు ధ్వంసం పై సీరోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా శిరోలు ఎస్సై పట్టించుకోకపోవడం  సంబంధించిన కథనాన్ని బాధితురాలు తెలపగా ప్రచురించినందుకు ఎస్సై నరేష్ అక్షర లీడర్ ప్రతినిధిని అవమానపరిచేలా సోషల్ మీడియా గ్రూపు నుండి తొలగించడం తోటి విలేకరుల ముందు అవమానపరచడమేనని వాస్తవాలు రాస్తే ఈ విధంగా చేయడం ఎస్సై నరేష్ కు సరికాదని ఈ సందర్భంగా అన్నారు.