Monday, 2 November 2026

వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి

ఎల్లారెడ్డి-జనంసాక్షి(ఏప్రిల్-30)
ఎల్లారెడ్డి:మండలంలోని ముత్యపు రాఘవులు ఫంక్షన్ హల్ సోమవారం జరిగిన వివాహావేడుకలలో ఎమ్మెల్యే రవిందర్ రెడ్డి పాల్గొన్నారు.అన్నసాగర్ గ్రామానికి చెందిన కరంగుల వెంకట్ రెడ్డి కుమార్తె వివాహా వేడుకలలో ఎమ్మెల్యే పాల్గొని నూతన వధువరులకు ఆశీర్వాదం అందించారు.అదేవిధంగా ఎల్లారెడ్డికి చెందిన పద్మశా కాశిరం కొడుకు వివాహానికి హాజరై వధువులకు ఆశీర్వదించారు.  ఆయన వెంట ఎల్లారెడ్డి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విద్యాసాగర్, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,కృష్ణ రెడ్డి తదితరులు ఉన్నారు.