-ముగ్గురికి గాయాలు
-మరికొద్దిసేపట్లొ గమ్యస్థానం చేరుకుంటుడగా ఘటన
-ముగ్గురు ఒకే కుటుంబంగా గుర్తింపు
ఉండవెల్లి ఏప్రిల్30(జనంసాక్షి)
జోగులాంబ గద్వాలజిల్లాలోని ఉండవెల్లి మండలంలోని పుల్లూరు టోల్ ప్లాజాసమీపంలో జాతీయ రహదారిపై తెల్లవారుజామున సుమారు 5గంటలసమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఎస్సై గడ్డంకాశీ తెలిపిన వివరాలమేరకు హైదరాబాద్ లో ఒక్క వివాహానికి హజరై కర్నూలుకు కారులో తిరిగి వెళుతుండగా డ్రైవ్ చేస్తున్న కిరణ్ సింగ్ నిద్రమత్తులో అదుపుతప్పి టోల్ గేట్ విషయసూచికబోర్డు ను డీకోటడంతో (డ్రైవర్) కిరణ్ సింగ్ 47సం,ఇతని కుటుంబ సభ్యులు, మేనకోడలు గాయత్రీ బాయ్18సం,కూతురు అర్షితబాయ్18సం,ఈముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు భార్యవిజయలక్ష్మి47సం,కుమారుడు విజయ్ సింగ్(10సం)లకు గాయాలుకావడంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో గమ్యస్థానానికి ప్రయాణికులు చేరుకుంటున్నారనగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘోర ఘటన ఒక్కెకుటుంబానికి చెందిన వారుకావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.అలంపూర్ సి.ఐ రజతరెడ్డి, మండల ఎస్సై గడ్డంకాశీ,కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





