వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టీపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 16 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ నియేజకవర్గం నేరెడుగొమ్ము మండల పరిధిలో గల పెద్దమునిగల్ గ్రామం లో నిర్వహిస్థునటువంటి వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రీకెట్ టోర్నమెంట్ ను సొమావారం నాడు స్థానిక నాయకులతొ కలిసి దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ భీల్యా నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేతావత్ బిల్యా నాయక్ మాట్లాడుతూ గెలుపొందిన టీం కి మొదటి బహుమతి గా 50,000 /రూ అందిస్తానని ప్రకటించారు మరియు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్థాయని విద్యార్థులు జీవితాలలో ఆటలు కూడా ముఖ్యం అని తెలిపారు తన చిన్ననాటి నుండి క్రికెట్ అంటే చాలా మక్కువ అని ఒత్తిడిని అధిగమించేందుకు శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు యువత క్రీడలో రాణించాలని సూచించారు మరియు క్రీడాకారులకు యువతకు ప్రజాప్రతినిధులకు కనుమ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు బాలు నాయక్, స్థానిక సర్పంచ్ పంబలి అంజయ్య, ఉప సర్పంచ్ రజినికమార్,బచ్చపురం సర్పంచ్ శ్రీదేవి జవహర్ లాల్,మొసంగడ్డ సర్పంచ్ భారత్,పెధ్ధమునిగల్ ఆలయ పూజారి అచ్చు స్వామి,హరి నాయక్,యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్ నాయక్,గడిగ లింగం గౌడ్, జైపాల్ నాయక్, క్రికెట్ అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు




