విశాఖలో ఆధార్‌ కార్డుల కష్టాలు

విశాఖ : ఆధార్‌ కార్డుల కష్టాలు విశాఖ నగరంలో కొనసాగుతూనే ఉన్నాయి, నగరంలో వేలాది  మందికి కార్డులు అందలేదు . ద్వారకా నగర్‌ ఆధార్‌ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే జనాలు బారులు తీరారు. ఈ కేంద్రం వద్ద ప్రతి రోజు ఉదయం 8 నుంచి 9మధ్య టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి క్యూలో ఉన్నప్పటీకీ టోకెన్లు దొరకడం ప్రజలు వాపోతున్నారు. రద్దీకీ తగ్గట్టుగా మరిన్ని ఆధార్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.