విశాల్‌ లాఠీ టీజర్‌ విడుదలకు రంగం సిద్దం

కోలీవుడ్‌ స్టార్‌ విశాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ’పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన విశాల్‌ ’పొగరు’, ’భరణి’, ’వాడు`వీడు’ సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గత కొంత కాలంగా వరుస ప్లాప్‌లలో ఉన్న విశాల్‌ ’డిటెక్టీవ్‌’, ’అభిమన్యుడు’ వంటి వరుస హిట్లతో తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలు సెట్స్‌పైన ఉన్నాయి. అందులో ’లాఠీ’ ఒకటి. ఎ.వినోద్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. ఇక ఈ సినిమా టీజర్‌ జూలై 24న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇటీవలే టీజర్‌ ప్రోమోను కూడా మేకర్స్‌ విడుదల చేశారు. తాజాగా చిత్రబృందం టీజర్‌ లాంచ్‌కు సిద్ధమవుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో సినిమా క్రూ మెంబర్స్‌ టీజర్‌ లాంచ్‌కు ఎª`లాన్‌ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో విశాల్‌ పోలీస్‌ అధికారిగా కనిపించనున్నాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముందుగా ఆగస్టు 11న విడుదల చేయాలని మేకర్స్‌ భావించారు. కానీ షూటింగ్‌ సమయంలో విశాల్‌ రెండు సార్లు మేజర్‌గా గాయపడటంతో చిత్రీకరణ లేట్‌ అయింది. దాంతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 15కు పోస్ట్‌ పోన్‌ చేశారు. ఈ చిత్రాన్ని రానా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రమణ, నంద సంయుక్తంగా నిర్మించారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.