*విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి*
సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య.
కోదాడ సెప్టెంబర్ 26(జనం సాక్షి)
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో జరిగిన జిల్లా విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాలతో పాటు అన్ని మండల కేంద్రాల్లో విశ్రాంతి ఉద్యోగులు సొంత భవనం ఏర్పాటు చేసుకోవడంతో పాటు నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం అన్నారు. అనంతరం ఇటీవల ఎన్నిక కాబడిన నూతన కార్యవర్గాలతో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఆయా సంఘాల్లో జరిగిన అభివృద్ధి గురించి విస్తృతంగా చర్చించారు. జిల్లావ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తప్పనిసరిగా పరిష్కరిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆర్థిక కార్యదర్శి అబ్దుల్ హమీద్ ఖాన్ కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు విద్యాసాగర్ రావు గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.