విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ
పెద్దాపురం: విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంట్లో చోరీ జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం గోలీవారి వీదీలో ఉంటున్న విశ్రాంత రైల్వే ఉద్యోగి బేల్జేపల్లి రామ్మూరి ఇంట్లోకి నిన్న రాత్రి ప్రవేశించిన దొంగలు 18 కాసులు బంగారం, నాలుగు కేజీల వెండిని దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. 8 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపాడు. పెద్దాపురం సీఐ పిట్ట సోమశేఖరం ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.



