విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడు

మెదక్, సెప్టెంబర్ 17, 2022
జనం సాక్షి ప్రతినిధి మెదక్
విశ్వకర్మ తనంతట తాను స్వయంభూ రూపమై అవతరించిన మహానీయుడని, అన్ని దిక్కులను చూడగల్గిన అమితమైన శక్తి కలవాడని జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ కొనియాడారు. విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వకర్మ నాలుగు యుగాలలో ఎన్నో పట్టణాలను నిర్మించాడని, సత్య యుగంలో దేవతలకోసం స్వర్గలోకం, త్రేతాయుగంలో శివుడి కోసం సువర్ణ లంకను, ద్వాపర యుగంలో ద్వారక నగరంను, కలియుగంలో హస్తినపురాన్ని నిర్మించాడని అన్నారు. సృష్టి తొలినాళ్ళనుంచి సుప్రసిద్ధులైన ఐదుగురు శిల్ప కళాకారులను సృష్టించిన మహానీయుడని అన్నారు. కమ్మరి, వడ్ల, కంచరి, కాష, అవుసుల సామాజిక వర్గానికి చెందిన వారు విశ్వకర్మకు జన్మించిన వారేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, అదనపు ఎస్పీ బాలస్వామి, బి.సి.అభివృద్ధి అధికారి కేశూరం, ABCDO యం. నాగరాజు గౌడ్, విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర కార్యదర్శి శంకరయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ , జిల్లా అధ్యక్షులు భువనేశ్వరి శ్రీనివాస చారి, ప్రధాన కార్యదర్శి కృపాచారి, కోశాధికారి కుబేరుడు, పట్టణ అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు బ్రహ్మం, సాయిబాబ తదితరులు పాల్గొన్నా రూ

తాజావార్తలు