Wednesday, 4 November 2026

విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఇల్లేందుల రాజు

మెట్పల్లి, మార్చి 23, జనంసాక్షి :
మెటుపల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలోని శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో బుధవారం రోజున విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం సంఘ సభ్యులు కలిసి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా ఇల్లేందుల రాజు ను , ఉపాధ్యక్షుడిగా పూసాల విష్ణు, కోశాధికారి గా వంగల రామస్వామి, కార్యదర్శి గా పుసాల శ్రీను, నూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు సంఘ సభ్యులు నూతన అధ్యక్షులు ఇల్లెందుల రాజు కు, కార్యవర్గం కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు ఇల్లెందుల రాజు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటూ పలు కార్యక్రమాలను, పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తానని అన్నారు