Wednesday, 4 November 2026

విషమంగానే ఎస్ఐ సిద్ధయ్య ఆరోగ్య పరిస్ధితి

 హైదరాబాద్: ఒకవైపు ఖేదం. మరోవైపు మోదం. ఎస్ఐ సిద్ధయ్య కుటుంబంలో చిత్రవిచిత్ర పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల కోసం ప్రాణాల్నే పణంగా పెట్టాడు సిద్ధయ్య. విధినిర్వహణలో దుండగుల కాల్పుల్లో గాయపడి… చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. కాల్పుల్లో గాయపడ్డ కొడుకును చూసి ఏడవాలో..? ధీశాలి మరో వారసుడ్ని ఇచ్చాడని సంతోషపడాలో..? తెలియడం లేదు. జానకీపురం ఎన్‌కౌంటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సిద్ధయ్య పరిస్ధితి విషమంగానే ఉంది. మూడు బుల్లెట్లు తొలగించిన వైద్యులు తలలో ఉన్న నాలుగో బుల్లెట్‌ను తీయలేకపోయారు. దాని కోసం ఆపరేషన్‌ చేయాలనుకున్నా.. ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. 24 గంటల వరకు ఏమీ చెప్పలేమని వైద్యులన్నారు. మరోవైపు సిద్ధయ్య భార్య హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *