Thursday, 5 November 2026

.వి.ఆర్.ఏ. ల.సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.

మాకవరపాలెం. ఫిబ్రవరి16. జనం సాక్షి.
వి.ఆర్.ఏ. ల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని విఆర్ఏ మండల అధ్యక్షుడు.నాగమయ్య. కార్యదర్శి. సత్యనారాయణ కోరుతున్నారు. వి.ఆర్.ఏ. ల సమస్యలు పరిస్కారం కోరుతూ మండల కేంద్రంలో వారు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఏళ్ల తరబడి ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు. సేవలు ను తమచే చేయించు కుంటూ తమచే వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్నా తమకు జీతాలు మాత్రం పెరగడం లేదన్నారు. ఇ ప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లు ఐన నామిని విఆర్ఏ లకు. పర్మినెంట్ చేయాలని. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని. కోరారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల విఆర్ఏ లు పాల్గొన్నారు.