వీఆర్ఏల నిరవధిక సమ్మెకు ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం.
చిట్యాల ఆగస్టు 9( జనంసాక్షి) వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 15వ రోజు చేరుకోగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు నేరెళ్ల ఓదెలు, తెరాస సీనియర్ నాయకులు శ్రీమన్నారాయణ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలకు పేస్కేల్ను వర్తింపజేసి ఆదుకోవాలని, అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్షత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కల్పించి సొంత గ్రామాలలో డబుల్ బెడ్రూంలో వంటి హామీలు ఇచ్చి ఆరు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు అమలు కాలేదని ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రాబోయే రోజులలో వీఆర్ఏలు ఉద్యమం వృదృతం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దబ్బెట రాజు, సహాయ కార్యదర్శి వేణువంక రమణాచారి, భోగం సాంబయ్య, సరస్వతి ,సురేష్, సదయ్య, ఆనందం, లక్ష్మయ్య, రాజు, చిరంజీవి, నాగరాజు ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.