వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి
5వ రోజుకు చేరుకున్న దీక్షలు
కేసముద్రం జులై 29 జనం సాక్షి / మండల కేంద్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ కొనసాగుతున్న నిరవధిక సమ్మె ఐదో రోజుకు చేరుకున్న సందర్భంగా దీక్షలో కూర్చున్న వీఆర్ఏలు మూతికి నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేదంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.దీక్షలో కూర్చున్న వారు నాగెల్లి నరసమ్మ, పప్పు కోమలత, ఆశాజ్యోతి, రంజిత్, ఎదరబోయిన మహేష్, సమ్మయ్య, వీఆర్ఏల మండల చైర్మన్ మాదారపు రమాదేవి మరియు ఇతర వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.