సివిల్ కానిస్టేబుల్స్ 54 మందికి హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పిస్తూ

సంగారెడ్డి జిల్లా యస్.పి.  యం. రమణ కుమార్
జనం సాక్షి సంగారెడ్డి టౌన్
జిల్లా కు చెందిన సివిల్ కానిస్టేబుల్స్ (54) మందికి  హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి కల్పిస్తూ సంగారెడ్డి జిల్లా యస్.పి.  యం. రమణ కుమార్  ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా యస్.పి  మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలకు పైగా కానిస్టేబుల్స్ గా ఉత్తమ సేవలనందించి, హెడ్-కానిస్టేబుల్స్ గా ప్రమోషన్స్ పొందడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారన్నారు. సుధీర్గ సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా తమవంతు భాధ్యతను నిర్వర్తించి, పదోన్నతి పొందడం సంతోషంగా వుందన్నారు. ఉద్యోగి ఉద్యోగ జీవితంలో ప్రమోషన్ అనేది ఒక మైలురాయి వంటిది. ప్రమోషన్ తో వారిలో ఉత్సాహం పెరుగుతుందన్నారు, హెడ్- కానిస్టేబుల్ ప్రమోషన్ తో వారి భాధ్యత మరింత పెరిగిందని గుర్తుచేశారు.
ఇక ముందు కూడా పోలీసు శాఖకు మరెన్నో ఉత్తమ సేవలనందించాలని ఆకాంక్షిస్తూ,   ప్రమోషన్స్ పొందిన సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేసారు.