వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి

డోర్నకల్ సెప్టెంబర్ 1 జనం సాక్షి
గత 39 రోజులుగా గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె చేస్తున్నారు.దీంతో గురువారం మండల కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో చేస్తున్న సమ్మె శిబిరం వద్ద పిఆర్టియు మండలాధ్యక్షుడు వెంపటి సీతారాములు నేతృత్వంలో ఉపాధ్యాయులు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.చాలీచాలని వేతనాలతో వీఆర్ఏలు సతమతమవుతున్నారని అన్నారు.ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కోరారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులున్నారు.