వీఆర్ఏల ముందస్తు అరెస్టు……

టేకుమట్ల.అక్టోబరు11(జనం సాక్షి)వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మహిళా వీఆర్ఏలు చేపట్టే ధర్నా   కార్యక్రమంలో భాగంగా  మండలంలోని వీఆర్ఏల అందరినీ స్థానిక ఎస్ఐ చల్లా రాజు ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.ఈ సందర్భంగా వీఆర్ఏల  మండల అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో  ప్రభుత్వం చేస్తున్న అరెస్టులు సిగ్గుచేటన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా అరెస్టు చేయడం దారుణమన్నారు.80 రోజులుగా  వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేస్తున్న  ప్రభుత్వానికి చీమకుట్టినట్టు లేదని,రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలనె అమలు చేయమని కోరుతున్నామని  కొత్తగా అడిగేది ఏమీ లేదని ఆయన అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని  ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  అరెస్టు అయిన వారిలో  వీఆర్ఏలు స్వామి,సమ్మయ్య, స్వామి, సురేష్, సందీప్, వీరస్వామి, జితేందర్, సతీష్.  తదితరులు ఉన్నారు.