వీఆర్ఏల ముందస్తు అరెస్ట్
రామారెడ్డి అక్టోబర్. 11 ( జనంసాక్షీ ) :
వీఆర్ఏలను ముందస్తుగా పోలీసులు అరెస్టులు చేశారని రామారెడ్డి మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చలో అసెంబ్లీ ముట్టడి కార్యచరణ లో బాగంగ అర్థరాత్రి మండల పరిదిలో ఉన్న వీఆర్ఏలను పోలీసులు అరెస్టులు చేశారన్నారు. మహిళ వీఆర్ఏలు మాత్రం నలుగురు కృషి విజ్ఞాన కేంద్ర ప్రాంతానికి చేరుకున్నారు అంతలోనే అక్కడి పోలీసులు కామారెడ్డి జిల్లాకు చెందిన వీఆర్ఏలను అరెస్ట్ చేసి , అక్కడి ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తరలించారని అన్నారు. ఎన్ని అరెస్టులు , నిర్బంధాలు విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల పన్నాగం పన్నిన పేస్కేల్ అమలు చేసే వరకు పోరాటాలు, సమ్మెలు ఆపేదీలేదన్నారు.
Attachments area