వీఆర్ఏల సంఘం మండల కమిటీ ఎన్నిక,

  నియామక పత్రాన్ని అందిస్తున్న  నర్సయ్య
పెన్ పహడ్.జులై  (జనం సాక్షి)  :  మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సమీక్ష సమావేశం నిర్వహించి నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మండల కమిటీ అధ్యక్షునిగా పఠాన్ జానీ పాషా, ఉపాధ్యక్షునిగా మధ్యల మధుసూదన్, ప్రధాన కార్యదర్శిగా మీసాల పద్మ నాగయ్య, కోశాధికారిగా పఠాన్ జానీ పాషా, గౌరవ అధ్యక్షుడిగా కా మల్ల వెంకటయ్య, ఈ కమిటీని సూర్యాపేట జిల్లా జేఏసీ చైర్మన్  గో బ్బి నర్సయ్య, ఆధ్వర్యంలో మండల కమిటీ ని ఎంపిక చేయటం జరిగినది  ఎన్నికైన మండల కమిటీ కి నియామక పత్రాన్ని అందజేశారు మండల కమిటీ కి సహకరించిన ప్రతి ఒక్కరికి మండలాధ్యక్షుడు పఠాన్ జానీ పాషా కృతజ్ఞతలు తెలిపినారు ఈ కార్యక్రమంలో ఎల్లమ్మ, భవాని, రాణి, పిచ్చమ్మ, లక్ష్మి, ప్రభాకర్, యాదగిరి, వీరయ్య, జానయ్య, రాములు, రామకృష్ణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు