వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

4వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మెకు
 సిపిఐ సంగారెడ్డి పట్టణ కమిటీ మద్దతు
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
4వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మెకు సిపిఐ సంగారెడ్డి పట్టణ కమిటీ మద్దతు
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి పట్టణ కార్యదర్శి ఎం డి మహబూబ్ ఖాన్
సంగారెడ్డి మండల కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా సిపిఐ సంగారెడ్డి పట్టణ కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేయడం జరిగింది
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సంగారెడ్డి పట్టణ కార్యదర్శి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గత రెండు సంవత్సరాల క్రితం ప్రకటించిన వీఆర్ఏల పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు 55 సంవత్సరాల నుండి వీఆర్ఏల వారసులకు వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. ఇప్పటికే వీఆర్ఏలు మూడు రోజులపాటు కలెక్టరేట్ కార్యాలయంలో నిరాహార దీక్షలు చేపట్టి అనంతరం అన్ని మండల కార్యాలయంలో సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నత అధికారులు స్పందించి న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం  చేస్తామని దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వం వహించాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సిహెచ్ రవి, దండు ప్రభాకర్, వీఆర్ఏలు వై మురళీధర్ రావు, చింతల రవికుమార్, సల్మా ఫాతిమా, నాగరాణి,యాదగిరి, చందు, దుర్గయ్య, వినోద్ దుర్గమ్మ నాగయ్య, శ్రీనివాస్, జంగమ్మ, యశోద సంగారెడ్డి మండలా విఆర్ఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Attachments area