వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బిజెపి జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్
మఖ్తల్ అక్టోబర్ 10 (జనంసాక్షి) సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను పరిష్కరించాలని బిజెపి జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యులు అమర్ దీక్షిత్ అన్నారు. కృష్ణ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న నిరోధిక సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలలో 594 మండలాల్లో వీఆర్ఏలు రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వీఆర్ఏలను గుర్తించి పే స్కేల్ ఇవ్వాలని అన్నారు. రిటర్మెంట్ తర్వాత వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన విఆర్ఏల కు ప్రమోషన్ ఇవ్వాలని కోరారు. వారి న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేరు చాలా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు పాల్గొన్నారు.
Attachments area