వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి *వీఆర్ఏలకు మద్దతు తెలిపిన బిజెపి నాయకులు
తూప్రాన్ (జనం సాక్షి )జూన్ 28 :: ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీఆర్ఏల సమస్యను వెంటనే పరిష్కరించాలని వారి సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు మండల బిజెపి నాయకులు మహేష్ గౌడ్ మద్దతు తెలిపారు తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీల నాలుగో రోజు నిరాహార దీక్ష కు సంఘీభావం తెలిపిన తూప్రాన్ బిజెపి నాయకులు తూప్రాన్ బిజెపి మున్సిపల్ అధ్యక్షులు మహేష్ గౌడ్ మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ జీవోను వెంటనే అమలు చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ కల్పించాలని వీఆర్ఏల డిమాండ్లను టిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని లేనిపక్షంలో బిజెపి ఆధ్వర్యంలో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కౌన్సిలర్ జమాల్పూర్ లక్ష్మీబాయి నర్సోజి జిల్లా నాయకులు తాటి విట్టల్ జానకిరామ్ గౌడ్ శరత్ వి ఆర్ ఎ డివిజన్ కో కన్వీనర్ బుడ్డ అంజి నరేందర్ భాస్కర్ రమేష్ రమ్య సుగుణ తదితరు వీఆర్ఏలు పాల్గొన్నారు

Attachments area