నేరేడుచర్ల (జనంసాక్షి )న్యూస్.ముఖ్యమంత్రి కేసిఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అయిన పెస్కెలు అమలు,వారసత్వ ఉద్యోగాలు, అర్హులకు ప్రమోషన్లు,తదితర డిమాండ్ల అమలుకు గత 75 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ
లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు,శుక్రవారం ప్రకటించిన కార్యాచరణలో భాగంగా శనివారం నాడు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విఆర్ఏ ల మండల అధ్యక్షురాలు పెరుమాళ్ళ పిచ్చమ్మ,లక్ష్మి,మణి,రాధ,శోభ, ఝాన్సీ,చంద్రకళ,సైదా, నాగు,అప్పయ్య,నాగు,ఖాదర్,అంతయ్ య,తదితరులు పాల్గొన్నారు.
Attachments area




