వీఆర్ఏల సమ్మెకు వివేకానంద యూత్ మద్దతు

అలంపూర్ ఆగస్టు7 (జనంసాక్షి)రాష్ట్ర వీఆర్ఏల జేఏసీ పిలుపు మేరకు అలంపూర్ మండల కేంద్రంలో మండల వీఆర్ఏలు నిరవదిక సమ్మే చేపట్టి14 వరోజు కొనసాగుతుంది. సమ్మేలో బాగంగా విఆర్ఏలు చేస్తున్నా సమ్మె శిబిరానికి వచ్చి ఆదివారం వివేకానంద యూత్ సంఘం అధ్యక్షులు సంజీవ నాయుడు,కార్యదర్శులు ప్రశాంత్,బుజ్జి వెంకటేశ్వర్లు, సర్వేశ్వరుడు, శ్రీనివాసులు, వెంకటస్వామి మరియు రవి వీఆర్ఏలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానంద యూత్ అధ్యక్షులు సంజీవ నాయుడు వీఆర్ఏలు చేస్తున్నావ్ సేవలు గుర్తించి వారు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, వారికి సరైన ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఇట్టి కార్యక్రమం అలంపూర్ మండల వీఆర్ఏల జేఏసీ అధ్యక్షులు అలీభాష
ఉపాధ్యక్షులు. వెంకటేష్
రహిమతుల్లా,రవి,హరి మరియు తదితరులు పాల్గొన్నారు.