వీఆర్ఏ లపై సర్కారు నిర్లక్ష్యం…..

దౌల్తాబాద్, ఆగస్టు 30, జనం సాక్షి.
 గత 37 రోజులుగా వీఆర్ఎలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం బాధాకరమని బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల నర్సింలు ఆన్నారు. మండల కేంద్రంలో వీఆర్ఏలు చేస్తున్న సమ్మె మంగళవారం నాటికి 37వ రోజుకు చేరుకుందని అసెంబ్లీలో హామీ ఇచ్చిన మేరకు పేస్కేలు వర్తింపజేసేలా జీవో జారీ చేయాలని, అర్హతలు ఉన్న వారికి పదోన్నతులు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్,రాయపోల్ మండల కన్వినర్ సంజీవ్,వీఆర్ఏ జేఏసీ నాయకులు యాదగిరి,మమత, బాను,అంజయ్య,షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.