వీఆర్ఏ ల న్యాయమైన కోరికలు పరిష్కరించాలి.
మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ.
బూర్గంపహాడ్ సెప్టెంబరు 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో వీఆర్ఏ- జేఏసీ నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె నేటితో 47వ రోజుకు చేరింది. మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చల్లా వెంకటనారాయణ శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 47 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా, 26 మంది వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోయినా కెసిఆర్ ప్రభుత్వం చెలించక పోవడం దారుణం అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి 09.09. 20 న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వీఆర్ఏలకు పే- స్కేల్ జీవోను విడుదల చేసి వెంటనే అమలు పరచాలన్నారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలుు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర న్యాయమైన కోరికలు అమలు పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగి వెంకటరావు, శ్రీకాంత్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.