వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలి-

దీక్ష లకు మద్దతు- సంఘీభావం
————-సీఐటీయూ
టేకులపల్లి ,సెప్టెంబర్ 9( జనం సాక్షి ): 47 రోజులు గా నిరసన దీక్షలు చేస్తున్న వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు వీఆర్ఏ ల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్& వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ సతీష్ కుమార్,మండల అధ్యక్షులు మూడు బిచ్చు, సీఐటీయూ నాయకులు కడుదుల వీరన్న,ఈసం నరసింహారావు,నూకల రమేష్, చీమల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.