సెల్వరాజ్ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ…
గోదావరి వరద సమయంలోనూ ముంపు బాధితుల ఆకలి తీర్చిన: సెల్వరాజ్.
– మండల వ్యాప్తంగా గణనాథుడి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు.
బూర్గంపహాడ్ సెప్టెంబరు 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో సెల్వరాజ్ ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో కొలువైన గణనాథుడికి భక్తులు వినాయక చవితి మొదలు ఈరోజు వరకు గణనాథుడికి విశేష పూజలు, ధూప, దీప నైవేద్యాలు అందించి భక్తులు పారవస్యం పొందారు. అశేష భక్తులతో విశేష పూజలు అందుకున్న లంబోధరున్ని వివిధ పూలు, పండ్లు,21 రకముల పత్రులతో ప్రత్యేకంగా అలంకరించి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సెల్వరాజ్ మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు తమపై ఉండాలని వేడుకున్నామన్నారు. ఏ పూజ నిర్వహించాలన్న ముందుగా గణపతి పూజ తోనే మొదలు పెడతారనీ, పండుగలలో వచ్చే పండుగ మొదటి పండుగ వినాయక చవితి పండుగ, అందుకే ఈ పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని సెలవరాజ్ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ క్రమంలోనే సెల్వరాజ్ తన సొంత ఖర్చులతోనే ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించటం విశేషమని గ్రామ ప్రజలు చెప్పుకోవడం విశేషంగా భావిస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తజనం అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. గోదావరి వరదల సమయంలో తనవంతుగా ఎంతో మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
మండలంలో పలుచోట్ల…
మండలంలో పలు గ్రామాలలో వాడవాడలా గణనాధుని మండపాల వద్ద విశేష పూజలు నిర్వహించి, గణపతిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి, అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.