Wednesday, 4 November 2026

వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన : మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )   భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎదిరించి కొట్లాడిన వీరవనిత మన చాకలి ఐలమ్మ అని మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ  కొనియాడారు .శనివారము  ఆర్కేపురం డివిజన్ లో తెరాస పార్టీ రజక సోదరులు ఎల్లయ్య, కంచర్ల శేఖర్, శ్రీరాములు ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 37వర్ధంతి కార్యక్రమం లో  టీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ,  ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ లు హాజరై   చాకలి ఐలమ్మ విగ్రహానికి   పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు .  ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్,ఖిల్లామైసమ్మ చైర్మన్ గొడుగు శ్రీనివాస్, నాయకులు సాజీద్, లింగస్వామి గౌడ్, కొండ్ర శ్రీనివాస్, దుబ్బాక శేఖర్,పెంబర్తి శ్రీనివాస్, ముచింతల జగన్, దేవేందర్,శ్యాంసుందర్ రావు తదితరులు పాల్గొన్నారు