Tuesday, 3 November 2026

వృద్దులు వితంతువులకు చీరల పంపిణీ

జులై 9 (జనంసాక్షి) కోహిర్ మండల కేంద్రంలో ని కోహిర్ లో ఎంపిటిసి అనిత సంపత్ కుమార్ ఆధ్వర్యంలో వృద్ధులు వితంతువుల మహిళలకు చీరలను పంపిణీ చేశారు. శనివారం  కోహిర్ గ్రామంలో  జహీరాబాద్ ఎమ్మెల్యే  మానిక్ రావు  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఎంపీటీసీ అనిత సంపత్ కుమార్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో నిరుపేద మహిళలకు,, వృద్దులకు,,వితంత్తువులకు సుమారు 100 మందికి చీరాల పంపిణీ కార్యక్రమమును ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలను ఘనంగా కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు నాగేష్, సునీల్,సమృది బాబు ,యువకులు మోహన్,దేవరాజ్,ప్రశాంత్ పనిందర్,అశోక్,మరియు స్థానిక యువకులు పాల్గొన్నారు.