Wednesday, 4 November 2026

వృద్ధాశ్రమంలో బియ్యం పనులు పంపిణీ చేసిన లయోలా కాలేజ్ విద్యార్థులు

ల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 22
 అల్వాల్ పట్టణ కేంద్రంలోని దీపావళి త్రయోదశి పురస్కరించుకొని లయోలా అకాడమీ డిగ్రీ పీజీ కళాశాల బికాం మార్కెటింగ్ విద్యార్థులు ఆధ్వర్యంలో లూర్దు మఠం విద్యాకారుణ్య వృద్ధాశ్రమంలో బియ్యం బ్యాగులు కందిపప్పుసంచీ బట్టలు బెడ్‌షీట్లు పండ్లు పంపిణీ చేశారు.దాదాపు 100 మంది మానసిక వికలాంగులైన పురుషులు మరియు మహిళలు ఈ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. ఈ వృద్ధాశ్రమం మేరీ హార్వెస్ట్ మిషన్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతుంది.
విద్యార్థుల్లో సహాయ సేవను పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యం.ఈ కార్యక్రమంలో మొదటి సంవత్సరం బికామ్ మార్కెటింగ్ నుండి 40 మంది విద్యార్థులు డిపార్ట్‌మెంట్ సోషల్ సర్వీస్ సెల్ కోఆర్డినేటర్లు జితేందర్ చౌదరి, ఉపాధ్యాయ సిబ్బంది అంజనీ కుమారి, డాక్టర్ జి సత్యనారాయణ, జి శ్రీవత్స లయోలా కాలేజ్.ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ ఎల్ జోజిరెడ్డి, కరస్పాండెంట్ రెవరెండ్ అమర్ రావు, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ అరుల్ జ్యోతి  మేనేజ్‌మెంట్ సభ్యుల సహకారంతో కార్యక్రమం విజయవంతం చేయడంజరిగింది.