సికింద్రాబాద్ (జనం సాక్షి ) సీతాఫల్ మండి డివిజన్ లో షెడ్యూల్ కులాల సేవ సహకార అభివృద్ధి సంఘం వారి సహకారంతో సావిత్రిబాయిపూలె ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ లో శిక్షణ పొందిన మహిళలకు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ చేతుల మీదుగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు . అనంతరం మహంకాళి జిల్లా సికింద్రాబాద్ బిజెపి ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి మాట్లాడుతూ ఎంతోమంది పేద మహిళలకు ఉపాధి అవకాశాల కోసం ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని ఫ్రైడే మార్కెట్లో ఏర్పాటు చేశామని తెలిపారు . శిక్షణ పొందిన మహిళలు తన సొంత కాళ్ల పై నిలబడటానికి కుట్టు మిషన్లు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలె అధ్యక్షురాలు బెల్లం మాధవి, బిజెపి సీనియర్ నాయకులు కృష్ణమూర్తి , ప్రభు గుప్తా , మేకల కీర్తి హర్షకిరణ్, మహిళలు నాయకులు పాల్గొన్నారు.
షెడ్యూల్ కులాల వారికి ఉచిత కుట్టుమిషన్ లు పంపిణీ…




