హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
హైదరాబాద్, జూన్22(జనం సాక్షి ) : కుటుంబంలోని వృద్ధులు, పెద్దలను దూషించకుండా వారికి సంతోషకరమైన వాతావరణం కల్పించే విధంగా అందరూ కృషి చేయాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్ మాట్లాడుతూ.. సమాజంలో నెలకొంటున్న మార్పులు, ఆర్థిక పరిస్థితులు, ఆధునికతతో ఉమ్మడి కుటుంబాలు విడిపోయి ఒంటరిగా మారుతున్నాయన్నారు. దీంతో కుటుంబంలోని పెద్దలు, వృద్ధులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీంతో వారికి కుటుంబంలోనే అనేక కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. దీంతో వారిని మంచిగా చూసుకొని సంతోషపెట్టేందుకు తీసుకోవాల్సిన అంశాలపై అందరికి అవగాహన కల్పించి వృద్ధ పౌరుల సంరక్షణ బాధ్యతను అందరూ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థకు చెందిన ప్రతినిధులు హాజరై ప్రసంగించి వృద్ధ పౌరుల కోసం తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.




