డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు
విజయవాడ, జూన్22(జనం సాక్షి ) : డీజీపీ మాలకొండయ్యకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఏ అధికారంతో నిందితుల్ని విూడియా ముందు ప్రవేశపెడుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఓ కేసులో ప్రకాశం జిల్లాకు చెందిన కావటి అలివేలును అనుమాసిస్తూ డీఎస్పీ మాధవరెడ్డి విూడియా ఎదుట ప్రవేశపెట్టారు. అయితే తన తల్లిని విూడియా ముందుకు తీసుకురావడం సరికాదంటూ కొడుకు కావటి సాగర్ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు నిందితుల్ని, అనుమానితుల్ని విూడియాకు చూపించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీస్‌శాఖని ఆదేశిస్తూ విచారణను ఈనెల 26కు వాయిదా వేసింది.