Thursday, 5 November 2026

వృద్ధ దంపతులపై దాడి చేసిన వ్యక్తిని ఆరెస్టు చేయాలి.

తుమ్మల అలోజి
బిజినేపల్లి, జనం సాక్షి .సెప్టెంబరు 20, మత్స్యకార వృత్తి చేసుకొని జీవనం సాగిస్తున్న 70 ఏళ్ల వృద్దు దంపతులపై దాడి చేసిన రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని వెంటనే ఆరెస్టు చేయాలని మండల మత్స్యకార సహాకార సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల అల్లోజీ డిమాండ్ చేశార మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలంలోని పులిమామిడి గ్రామ ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన వృద్ధులు యాదయ్య ముదిరాజ్ దంపతులకు చెందిన వ్యవసాయ భూవి పై కన్నేసి బలవంతంగా లాక్కునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో చంపేందుకు దాడి చేసిన వ్యక్తిని కఠిన శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అతడిపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మత్స్యకారులంతా కలిసి న్యా యం జరిగే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి బంగారయ్య, మండల ఉపాధ్యక్షుడు సాప్పరి బాలస్వామి, కృష్ణయ్య, శివ తదితరులు ఉన్నారు.
Attachments area