Tuesday, 3 November 2026

వెన్నుపోటు దారులకే పదవులు : అరవింద్‌ గౌడ్‌

హైదరాబాద్‌ : పార్టీకి వెన్నుపోటు పొడిచి బయటకి వెళ్లి వచ్చిన వాళ్లకే అధికేత పదవులు కట్టబెడుతున్నాడని టీడీపీ బీసీ నేత అరవింద్‌ కుమార్‌గౌడ్‌ విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం టీడీపీలో అసమ్మతి ముసలం మెదలైంది. 20 ఏళ్లుగా పదవులు లేకుండా పార్టీకి సేవలు చేస్తున్న గుర్తింపు లేకపోవడం పట్ల అరవింద్‌ కుమార్‌ గౌడ్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే అసమ్మతి రాగం వినిపించిన దాడి బాటలో అరవింద్‌కుమార్‌గౌడ్‌ అసమ్మతి గళం విప్పారు. వెన్నుపోట్ల సమయంలోనూ పార్టీకి అండగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. క్యాకర్తల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. పని చేసే వాళ్లను గుర్తించకపోతే పార్టీ ముందుకు పోవడం కష్టమని అరవింద్‌కుమార్‌ గౌడ్‌ అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *