హైదరాబాద్ : ‘మాది రైతు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ‘ అని వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఇవాళ ఆయన రైతులకు ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై జరిగిన రైతు సంఘాల నేతలు, మంత్రుల సదస్సులో మాట్లాడారు.2013-14 సంవత్సరానికిగాను వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రబేశపెట్టారని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయించారు. ఇది ఆయన నిర్ణయమేనని తెలిపారు. రైతు సమస్యలపై సమీక్షించేందుకు చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక కమిటీని నియమించామని మంత్రి కన్నా తెలిపారు. ఈ కమిటీ ప్రతీ మూడు నెలలకొకసారి భేటీ అవుతుందని వివరించారు.




